ముంబై: ‘రెబల్' చిత్రంలో గ్యాంగ్ స్టర్ బ్రదర్‌గా విలన్ పాత్ర పోషించిన
విక్రమ్ సింగ్ గుర్తున్నాడా? బాలీవుడ్ కు చెందిన ఈ నటుడు మహేష్ బాబు,
సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా విలన్ పాత్ర చేసే అవకాశం
దక్కించుకున్నాడు. ఇటీవల గోవాలో జరిగిన షూటింగులో మహేష్, విక్రమ్ సింగ్
మధ్య ఫైట్ సీన్లు చిత్రీకరించారు.
ప్రభాస్ రెబల్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విక్రమ్ సింగ్...ప్రభాస్ ఎవరో తెలియకుండానే ‘రెబల్' చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడట. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఆరు బాలీవుడ్ సినిమాల్లో నటించాను. ఒకసారి లారెన్స్ మాస్టర్ తన సినిమాలో విలన్స్ పాత్ర చేసే వారి కోసం ముంబై వస్తే నా ఫ్రెండ్ సలహా మేరకు ఆయన్ను హోటల్‌లో కలిసాను. నన్ను చూసిన వెంటనే లారెన్స్ ఓకే చేసారు.
కానీ అప్పటి వరకు నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. ఆతర్వాత ఇంటర్నెట్‌లో ప్రభాస్ ను చూసాను. అప్పుడు తెలిసింది ప్రభాస్ గురించి' అంటూ విక్రమ్ సింగ్ చెప్పుకొచ్చారు. రెబల్ చిత్రంలో నటించడం వల్లనే తెలుగులో మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో అవకాశం దక్కింది. రెబల్ చిత్రం విడుదలకు వారం ముందే సుకుమార్‌ను కలిసాను. నా పాత్ర ఓకే అయింది. రెబల్ చిత్రంలో నా పెర్ఫార్మెన్స్ చూడకుండానే ఆయన అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్నాను అంటూ విక్రమ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

No comments:
Post a Comment